ప్రమోషన్స్ విషయంలో ‘దేవర’ (Devara) మూవీ టీం దూకుడుగా వ్యవహరించడం లేదని జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కాస్త అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అభిమానుల్లో ఉత్సాహం నింపేలా ఈ పది రోజులు ప్రమోషన్ల మోత మోగించనుందట టీం.

తమిళనాట ప్రమోషన్స్ కోసం ‘దేవర’ టీం ఇప్పటికే చెన్నై వెళ్ళింది. ఎన్టీఆర్ సహా మిగతా టీం అంతా కలిసి ఈరోజు (సెప్టెంబర్ 17) సాయంత్రం చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. అలాగే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సెప్టెంబర్ 19న ఎన్టీఆర్ అండ్ టీం చండీగఢ్ వెళ్తున్నారట.

మరోవైపు తెలుగులోనూ ప్రమోషన్స్ ఊపందుకోనున్నాయి. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ అండ్ లొకేషన్ లాక్ అయినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 22న హైదరాబాద్ లోని నోవాటెల్ లో ఈవెంట్ నిర్వహించనున్నారని సమాచారం.

ఓవర్సీస్ ప్రమోషన్స్ విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు మేకర్స్. ప్రీ రిలీజ్ ఈవెంట్ ముగిసిన వెంటనే సెప్టెంబర్ 23న ఎన్టీఆర్ అమెరికా వెళ్లనున్నాడట. అక్కడ పలు ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. ముఖ్యంగా హాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘బియాండ్ ఫెస్ట్’లో ‘దేవర’ సినిమాని ప్రదర్శించబోతున్నారు. లాస్ ఏంజెల్స్ లోని ఐకానిక్ ఈజిప్షియన్ థియేటర్ లో సెప్టెంబర్ 26 సాయంత్రం దేవరను ప్రదర్శించనున్నారు. ఈ షోకి ఎన్టీఆర్ హాజరు కానున్నాడు. ఆ తర్వాత, సినిమా విడుదల రోజు అనగా సెప్టెంబర్ 27న ఎన్టీఆర్ హైదరాబాద్ కి తిరిగి రానున్నాడట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here