స్టార్ హీరోల సినిమాలకు ప్రమోషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే సెప్టెంబర్ 27న విడుదల కానున్న భారీ చిత్రం ‘దేవర’ (Devara) ప్రమోషన్స్ విషయంలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా ‘దేవర’ టీంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న మూవీ ‘దేవర’. ఈ సినిమా విడుదలకు ఇంకా పది రోజులే ఉంది.  ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో సినిమా వస్తుందంటే తెలుగునాట ఉండే సందడే వేరు. ఆ సందడిని రెట్టింపు చేసేలా.. మాస్ ని అట్రాక్ట్ చేసేలా.. అగ్రెసివ్ ప్రమోషన్స్ ఉండాలి. కానీ ‘దేవర’ టీం మాత్రం అందుకు భిన్నంగా అడుగులు వేస్తోంది. ప్రమోషన్స్ లో దూకుడు చూపించడం లేదు. 

అయితే దీని వెనుక ఓ స్ట్రాటజీ ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ సినిమా అంటే తెలుగునాట ఎలాగూ రికార్డు ఓపెనింగ్స్ వస్తాయి. అందుకే విడుదలకు ముందు మితిమిరీన అంచనాలు పెంచే కంటే.. థియేటర్లకు వచ్చిన ఆడియన్స్ ని తమ కంటెంట్ తో సర్ ప్రైజ్ చేయాలనేది మేకర్స్ స్ట్రాటజీ అని సమాచారం. ‘దేవర’ సినిమా అవుట్ పుట్ పట్ల మేకర్స్ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారట.అందుకే, తుఫానుకి ముందు ప్రశాంతతలా.. కొత్త స్ట్రాటజీతో ముందుకు వెళ్తూ.. విడుదల తర్వాత సంచలనం సృష్టించాలని చూస్తున్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here