రైటర్ గా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి మిర్చి, శ్రీమంతుడు, భరత్ అనే నేను, జనతాగ్యారేజ్ తో కొరటాల శివ(koratala siva)స్టార్  డైరెక్టర్ అనే టాగ్ లైన్ నిపొందాడు.కాకపోతేచిరంజీవి(chiranjeevi)రామ్ చరణ్(ram charan)ల ప్రెస్టేజియస్ట్ మూవీ ఆచార్య ఘోర పరాజయాన్నిఅందుకోవడంతో అనేక విమర్శలని ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఆ విమర్శలకి  ఎన్టీఆర్(ntr)వన్ మాన్ షో దేవర(devara)తో సమాధానం చెప్పబోతున్నాడు.

ఇక దేవర తర్వాత కొరటాల ఎలాంటి సినిమా చేస్తాడు, హీరోగా ఎవరుంటారనే  ఆసక్తి అందరిలో కలగడం సహజం. సినీ సర్కిల్స్ లో తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్(mohan lal)కొడుకు ప్రణవ్ మోహన్ లాల్(pranav mohan lal)సినిమాని  కొరటాల తన నెక్స్ట్ మూవీగా ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది.ఈ మేరకు కథా చర్చలు కూడా జరిగాయని, ప్రణవ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తలు కూడా వస్తున్నాయి. మోహన్ లాల్ కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడని  అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  అత్యంత భారీ వ్యయంతో నిర్మించబోతోందని కూడా అంటున్నారు. దేవర రిలీజ్ తర్వాత ఈ  విషయంపై అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కొరటాల,మైత్రి కాంబోలో వచ్చిన ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ ఒక ముఖ్య పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

బాలనటుడిగా మలయాళ సినీ రంగ ప్రవేశం చేసిన ప్రణవ్ పలు సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి 2018 లో  ఆది అనే చిత్రం ద్వారా సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.ఇప్పటి వరకు ఇరుపతియొనం నూతండు, హ్రిదయమ్,  వర్షన్గళక్కు శేషం అనే మూవీస్ చేసాడు.కానీ ఇంతవరకు  సరైన బ్రేక్ రాలేదు. మరి కొరటాల శివ ఆ బ్రేక్ ని ఇస్తాడేమో చూడాలి. అదే విధంగా కొరటాల ఫస్ట్ మలయాళ మూవీ కూడా అదే అవుతుంది. 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here