నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 6న ఆయన డెబ్యూ మూవీ అనౌన్స్ మెంట్ వచ్చింది. ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకుడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఇది రూపొందనుంది. బాలకృష్ణ కుమార్తె తేజస్విని సమర్పణలో లెజెండ్ ప్రొడక్షన్స్ తో కలిసి ఎస్.ఎల్.వి. సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మూవీ బడ్జెట్.. ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. (Nandamuri Mokshagna)

ఎంత స్టార్ వారసుడు అయినప్పటికీ మొదటి సినిమాకి రిస్క్ లేకుండా రూ.50 కోట్ల లోపు బడ్జెట్ పెడుతుంటారు. కానీ మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి మాత్రం ఏకంగా రూ.100 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టబోతున్నారనే వార్త సంచలనంగా మారింది. అదే సమయంలో ప్రస్తుతం ఈ సినిమాపై నెలకొన్న క్రేజ్ ని బట్టి చూస్తే.. వంద కోట్లు పెద్ద మేటర్ కాదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దానికితోడు ప్రశాంత్ వర్మ దర్శకుడు కావడం ఈ సినిమాపై మరింత క్రేజ్ ఏర్పడేలా చేసింది. యువ హీరో తేజ సజ్జతో చేసిన ‘హనుమాన్’ తోనే రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కొల్లగొట్టి సంచలనం సృష్టించాడు ప్రశాంత్ వర్మ. అలాంటిది ఇది నందమూరి వారసుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ. ఈ లెక్కన పాజిటివ్ టాక్ వస్తే.. ఈ సినిమా కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఏమాత్రం వెనకాడకుండా భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించడానికి మేకర్స్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here