ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ( Jani Master ) ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్న సంగతి మనకు తెలిసిందే.ఈయన తన అసిస్టెంట్ పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అంటూ ఆమె రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా బాధితురాలు నార్సింగ్ ప్రాంతానికి చెందినది కావడంతో రాయదుర్గం పోలీసులు ఈ కేసును నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి బదిలీ చేశారు.

 Jani Master Opens Up Case Filed On Him, Jani Master, Case Filed, Sekhar Master ,-TeluguStop.com

ఈ క్రమంలోనే నార్సింగ్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 376 (రేప్), క్రిమినల్ బెదిరింపు (506) , స్వచ్ఛందంగా గాయపరచడం (323)లోని క్లాజ్ (2) (ఎన్) కింద కేసు నమోదు చేశారు.

ఈ విధంగా జానీ మాస్టర్ గురించి ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో సంచలనంగా మారడంతో ఈ వార్తలపై ఆయన స్పందించారు.నా గురించి వస్తున్న వార్తలలో ఏమాత్రం ఆధారాలు లేవని ఇవన్నీ కూడా నాపై కక్ష సాధింపు చర్యలో భాగంగా చేస్తున్నవేనని తెలిపారు.కొంతమంది డబ్బులు ఇచ్చి తనపై ఇలాంటి ఆరోపణలకు పాల్పడ్డారని జానీ మాస్టర్స్ వెల్లడించారు.

యూనియన్ గొడవల్లో భాగంగా కొందరు ఆ మహిళతో తనపై కేసు పెట్టించారని అన్నారు.నేను కనుక తప్పు చేసినట్లు రుజువైతే నన్ను శిక్షించండి అందుకు నేను సిద్ధంగానే ఉన్నానని ఈయన తెలిపారు.ఇలా జానీ మాస్టర్ గురించి ఇలాంటి ఆరోపణలు వస్తున్న తరుణంలో ఇప్పటివరకు గణేష్ మాస్టర్ ( Ganesh Master) శేఖర్ మాస్టర్( Sekhar Master )వంటి వారు కూడా ఎవరూ స్పందించలేదు.ఇక జనసేన పార్టీ( Janasena Party ) లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నటువంటి జానీ మాస్టర్ కు జనసేన పార్టీ కూడా షాక్ ఇచ్చింది.

కొద్దిరోజుల పాటు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఈయనకు సూచనలు చేశారు.మరి ఈ విషయంలో జానీ మాస్టర్ ఎలాంటి పరిణామాలను ఎదుర్కొనబోతున్నారో తెలియాల్సి ఉంది.

.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here