అతిషిని ఎందుకు ఎంపిక చేశారు?
దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గతవారం బెయిల్‌పై బయటకు వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్.. దిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్టు ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి.. దిల్లీ సీఎం కుర్చీ ఎవరిని వరిస్తుంది? అన్న ప్రశ్నపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అతిషి సహా ఆప్‌కి చెందిన మరో ఐదుగురు పేర్లు రేసులో వినిపించాయి. కేజ్రీవాల్, తన భార్యకు ఆ బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉందని వార్తలు వినిపించాయి. చివరికి.. మంగళవారం సాయంత్రం కేజ్రీవాల్ రాజీనామాకు రెడీ అవుతుండగా, సీఎం పదవికి అతిషి పేరు ఖరారైనట్టు మధ్యాహ్నం నాటికి వార్త బయటకు వచ్చింది. మంగళవారం ఉదయం 11 గంటలకు జరిగిన ఆప్ శాసనసభాపక్ష సమావేశంలో అతిషిని సీఎం చేయాలన్న నిర్ణయం తీసుకున్నారు.