లైంగిక వేధిపుల కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న జానీ మాస్టర్(jani master)ప్రస్తుతం నెల్లూరులో తల దాచుకున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఇక ఈ విషయంపై బాధిత లేడీ డాన్సర్ కి  పలువురు సినీ ప్రముఖులు మద్దతుగా నిలుస్తున్నారు. ఆ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. తాజాగా ప్రముఖ నటి, యాంకర్ అయినటువంటి  అనసూయ(Anasuya Bharadwaj)కూడా తన మద్దతుని తెలియచెయ్యడంతో పాటుగా కొన్ని విషయాలని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

బాధిత యువతితో కలిసి పుష్ప(pushpa)మూవీకి వర్క్ చేశాను.సెట్స్ లో రెండు, మూడుసార్లు కూడా తనని చూశాను. తనకి మంచి ట్యాలెంట్ ఉంది. ఆ టాలెంట్ ని ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితులు  ఏమాత్రం తగ్గించలేవు. అలాగే  తను ఎదుర్కొంటున్న ఇబ్బందులు బయటకు తెలియకుండా దాచి పెట్టిందనే విషయం ఇప్పుడు తెలుస్తుంది.ఇలాంటి సంఘటనలని  మనసులోనే దాచుకుని బాధ పడటం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. నా వర్క్ ప్లేస్ లో తోటి మహిళలకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే స్పందిస్తాను. వారికి మద్దతుగా నిలబడుతాను. ఇప్పుడు ఈ వ్యవహారంలో కూడా బాధితురాలికి న్యాయం జరగాలని భావిస్తున్నాను. ఇందుకోసం సపోర్టుగా ఉన్న ఫిలిం ఛాంబర్ పెద్దలందరికి  కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.ఇక  రాబోయే రోజుల్లో ఇండస్ట్రీలో ఉన్న  ఏ మహిళకు ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకూడదని కోరుకుంటున్నానని చెప్పింది.

అదే విధంగా మహిళలందరూ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే  ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే వెంటనే బయటకు చెప్పాలి. మనకి ఎవరి  సానుభూతి అవసరం లేదు. అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం ఉండాలి. మీరే కాదు, మీకు తెలిసిన వాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, వాటిని ధైర్యంగా ప్రతిఘటించాలి. మీకు అందరూ అండగా నిలబడుతారనే విషయాన్నీ మర్చిపోకూడదని  కూడా చెప్పుకొచ్చింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here