Plastic in Food: ఆధునిక ప్రపంచంలో మైక్రో ప్లాస్టిక్‌ల ప్రమాదం పెరుగుతూ వస్తోంది. మనకు తెలియకుండానే మైక్రోప్లాస్టిక్ మన ఆహారంలో కలిసిపోతోంది. జామా నెట్ వర్క్ ఓపెన్ జర్నల్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం చనిపోయిన ఒక మనిషి ముక్కు కణజాలంలో చిన్న ప్లాస్టిక్ ముక్కలు కనిపించాయి. మైక్రో ప్లాస్టిక్ ముక్కలు ముక్కులోకి చేరాయంటే అవి ఆహారం ద్వారా చేరి ఉంటాయని అంచనా వేస్తున్నారు. కేవలం ముక్కులోనే కాదు గతంలో చేసిన అధ్యయనాల్లో ఈ నానో ప్లాస్టిక్‌లు ఊపిరితిత్తులు, కాలేయం, పురుషాంగం, మానవ రక్తం, మూత్రం, తల్లిపాలలో కూడా చేరినట్టు గుర్తించారు. ఆహారం ద్వారానే మైక్రో ప్లాస్టిక్ మన శరీరంలో ప్రవేశిస్తాయి. ఇలా ప్లాస్టిక్ అధికంగా కలిగి ఉన్న ఐదు ఆహారాలు జాబితా ఇక్కడ ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here