సింధు నదీ జలాల ఒప్పందం ఏంటి?

ప్రపంచ బ్యాంకు సహాయంతో భారతదేశం, పాకిస్తాన్ మధ్య చర్చలు జరిగిన తొమ్మిదేళ్ల తర్వాత 1960లో సింధు జలాల ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఇది అత్యంత విజయవంతమైన అంతర్జాతీయ ఒప్పందాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ ఒప్పందానికి చాలా చరిత్ర ఉంది. ఈ ఒప్పందం సింధు, జీలం, చీనాబ్‌లను పాకిస్తాన్‌కు, రావి, బియాస్, సట్లెజ్‌లను భారతదేశానికి కేటాయిస్తుంది. ఇవన్నీ సింధు నదికి ఉపనదులు. రెండు దేశాలకు ఈ నదులపై కొన్ని ఉపయోగాలు అనుమతించారు. ఈ సమయంలో నీటి వినియోగం, నీటి పరిమాణానికి సంబంధించి భారత్, పాక్ మధ్య ఒప్పందం కుదిరింది. సింధు నదిపై భారత్, పాకిస్థాన్, అఫ్గానిస్తాన్, చైనా వంటి దేశాలతో వివాదం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here