మూవీ : సెక్టార్ 36 

నటీనటులు: విక్రాంత్ మెస్సే, దీపక్ డోబ్రియల్, ఆకాశ్ ఖురానా, బహరుల్ ఇస్లామ్ తదితరులు

రచన : భోదయాన్ రాయ్ చౌదరి

ఎడిటింగ్: ఏ. శ్రీకర్ ప్రసాద్

సినిమాటోగ్రఫీ: సౌరభ్ గోస్వామి

మ్యూజిక్: సవేరా ధంకీ, గౌరవ్ దాస్ గుప్తా, కేథన్

దర్శకత్వం: ఆదిత్య నింబాల్కర్

ఓటీటీ: నెట్ ఫ్లిక్స్

కథ: 

సెక్టార్ 36 కు దగ్గర్లో బల్బీర్ సింగ్ బస్సీ(ఆకాశ్ ఖురానా) అనే ధనవంతుడి బంగ్లాలో ప్రేమ్ సింగ్( విక్రాంత్ మెస్సే) పనిచేస్తుంటాడు. ప్రేమ్ సింగ్ చూడటానికి చాలా సాధాసీదాగా ఉంటాడు.  అయితే ఎవరికి తెలియని నిజమేంటంటే.. అతను చిన్నపిల్లలని, టీనేజర్స్ ని ఎత్తుకెళ్ళి దారుణంగా చంపేస్తుంటాడు. వారిని చంపేసి వారి అవయవాలని ముక్కలు ముక్కలుగా నరికి ప్లాస్టిక్ బ్యాగ్స్ లో ప్యాక్ చేసి మురికి కాల్వలో పడేస్తుంటాడు. ఒకసారి ఇన్ స్పెక్టర్  రామ్ చరణ్ పాండే (దీపిక్ డోబ్రియల్) కూతురిని ప్రేమ్ సింగ్‌ కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తుండగా అతడిని పోలీసులు చూస్తారు. దాంతో అతను అక్కడి నుండి పారిపోతాడు. ప్రేమ్ సింగ్ ముఖానికి మాస్క్ ఉండటంతో ఎవరు అతడిని గుర్తుపట్టరు. దాంతో ఇన్ స్పెక్టర్ పాండే అప్పటివరకు మిస్సింగ్ అయిన పిల్లల కేసులను టేకప్ చేస్తాడు. మరి ప్రేమ్ సింగ్ చిన్నపిల్లలని ఎందుకు చంపుతున్నాడు? ఇన్ స్పెక్టర్ పాండే పిల్లల మిస్సింగ్ ని కనిపెట్టాడా లేదా తెలియాలంటే సెక్టార్ 36 (Sector 36)  చూడాల్సిందే.

విశ్లేషణ:

నోయిడాలోని సెక్టార్ 36 లో 2005-06 సంవత్సరాలలో చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్ళి దారుణంగా చంపేశారు. అదే ‘నిఠారి కిల్లింగ్స్’. అప్పట్లో ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు అదే కేస్ ని కథా వస్తువుగా తీసుకొని దర్శకుడు ఆదిత్య నింబాల్కర్ ఈ సెక్టార్ 36( Sector 36) ను తీసాడు. ఇది వాస్తవికతకి చాలా దగ్గరగా ఉంటుంది‌.

రెండు గంటల నాలుగు నిమిషాల నిడివితో హిందీతో పాటుగా తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని చిన్నపిల్లలతో కూర్చొని చూడకపోవడమే బెటర్. ఎందుకంటే చిన్నపిల్లల్ని దారుణంగా చంపే సీన్లు ఉంటాయి. ఇంకా బోలెడన్ని అశ్లీల పదాలు ఉంటాయి. సింగిల్ గా చూడటమే  బెటర్. ఇది ఓ క్రైమ్ థ్రిల్లర్.. కానీ ట్విస్ట్ లు ఏమీ ఉండవు. మూవీని పెద్దగా సాగదీయకుండా సూటిగా పాయింట్ కి వచ్చేశాడు‌ దర్శకుడు. అసలేం జరిగిందనేది చూపించాడు అంతే. మిగతా థ్రిల్లర్స్ లో లాగా సైకో ఎవరనేది ఎప్పుడో క్లైమాక్స్ లో తెలియడం, చంపింది ఎవరనే క్యూరియాసిటి ఏం ఉండదు. కానీ ప్రేమ్ సింగ్( విక్రాంత్ మెస్సే) పాత్ర వెన్నులో వణుకు పుట్టిస్తుంది. నెగెటివ్ షేడ్స్ లో అతడిని చూస్తే షాక్ అవుతారు.

10th Fail సినిమాలోని విక్రాంత్ మెస్సేకి ఈ మూవీలోని క్యారెక్టర్ కి చాలా డిఫరెంట్స్ ఉంటుంది. ఇక ఇది ఎందుకు చూడొచ్చంటే.. చిన్నపిల్లల్ని అప్పుడు ఇలా చేసి చంపారా.. అసలెలా చంపగలిగారు అనే భయాన్ని చూసేవారిలో కలిగించే విధంగా ఉంటుంది. ముఖ్యంగా మన చుట్టూ మనుషుల ప్రవర్తన ఇంత దారుణంగా ఉంటుందా అనే పాయింట్ ని చూపించారు. ఎంటర్‌టైన్మెంట్ కోసమో , సెంటిమెంట్ కోసమో నాలుగు పాటల కోసమో, ఫైట్ల కోసమో అయితే ఈ సినిమాని స్కిప్ చేస్తే బెటర్. ఇక కథ బాగున్నప్పటికి మొదటి ముప్పై నిమిషాల తర్వాత స్లోగా సాగుతుంది. ఒక డాక్యుమెంటరీలాగా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ నీట్ గా ఉంది. మ్యూజిక్ మైనస్. బిజిఎమ్ పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు: 

ప్రేమ్ సింగ్ పాత్రలో విక్రాంత్ మెస్సే ఒదిగిపోయాడు. ఎంతలా అంటే మర్డరర్ ఇలానే ఉండేవాడేమో అనిపించేంతలా నటించాడు. ఇక పోలీస్ ఆఫీసర్ రామ్ చరణ్ పాండే రోల్ లో దీపిక్ డోబ్రియల్ ఆకట్టుకున్నాడు. ఇక మిగతావారంతా తమ పాత్రలకి న్యాయం చేశారు. 

ఫైనల్ గా :  నో థ్రిల్స్ బట్ వన్ టైమ్ వాచెబుల్ మూవీ.

రేటింగ్ : 2.5 / 5

✍️. దాసరి  మల్లేశ్


 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here