శ్రీ కాశీ విశ్వనాథ్ పిక్చర్స్ నిర్మించిన చిత్రం ‘కన్యక’. ఎయిర్‌‌టెల్ ఎక్స్‌‌స్ట్రీమ్, హంగామా, టాటా ప్లే బిన్జ్, వాచో, విఐ మూవీస్ టీవీ ఇంకా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో స్ట్రీమింగ్ అవుతోంది.

విశ్వనాథ శాస్త్రి అనే ఒక బ్రాహ్మణోత్తముని కూతురు కన్యక కనిపించకుండా పోతుంది. ఆ అమ్మాయి లేచి పోయిందా లేదా ఎవరైన చంపేసారా అని శ్రావ్య అనే అమ్మాయి ఆ ఊరి కొచ్చి విశ్వనాథ శాస్త్రి ఇంటిలోనే ఉంటూ ఇన్విస్టిగేట్ చేస్తుంది. కన్యక ఏమైంది? వచ్చిన అమ్మాయి ఎవరు? చివరి వరకు అసలు ఏం జరిగింది? అని సస్పెన్స్ కథాంశంతో.. మనం చేసిన తప్పులను ఒక కన్ను గమనిస్తుంది అని మెసేజ్ తో నడిచే ఈ సినిమా ని నకరికల్లు ప్రాంత వాసులైన నిర్మాతలు కెవి అమరలింగేశ్వరరావు, ఆతుకూరి సాంబశివరావు, కూరపాటి పూర్ణచంద్ర రావు నిర్మించారు.

నిర్మాతలు మాట్లాడుతూ.. మొదటి సినిమానే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేసినందుకు ఆనందంగా ఉందని, నకరికల్లు వాసవి కన్యక టెంపుల్ లో అమ్మవారి మీద  చిత్రీకరించిన పాట హైలట్ అని, కుటుంబం మొత్తం కలిసి చూడగలగిన చక్కని చిత్రం అని పేర్కొన్నారు.

 

దర్శకుడు రాఘవ మాట్లాడుతూ.. ఆడవారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తే ఎవరు క్షమించినా అమ్మవారు క్షమించదు శిక్షిస్తుందని ఈ చిత్రం ద్వారా తెలియజేస్తున్నామని, సినిమా చాలా తక్కువ రోజుల్లో తక్కువ బడ్జెట్ లో ఫినిష్ చేసామని, షూటింగ్ కు  నకరికల్లు మరియు చాగంటి వారి పాలెం వాసులు మాకు ఎంతో సహకరించారని చెప్పారు. చిత్ర ట్రైలర్, వీడియో సాంగ్ యూ ట్యూబ్ లో రిలీజైన రోజు నుండి ట్రెండింగ్ లో ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ సినిమాలో శివరామరాజు, జబర్దస్త్ వాసు, ఈశ్వర్, శ్రీహరి , PVL వర ప్రసాదరావు, సర్కార్,ఫణిసూరి, RMP వెంకటశేషయ్య, సాలిగ్రామం  మమత ,శిరీష , విజయ , రేవతి తదితరులు నటించారు. ఈ చిత్రానికి అర్జున్ సంగీతం అందించగా.. సినిమాటోగ్రాఫర్స్ గా రాము, తరుణ్, ఎడిటర్ గా సుభాన్ వ్యవహరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here