బంగ్లా ముందు భారీ టార్గెట్?

ఈ క్రమంలో ఇప్పటికే నాలుగో వికెట్‌కి 160 బంతుల్లో 99 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని ఈ ఇద్దరూ నెలకొల్పారు. దాంతో భారత్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 46 ఓవర్లు ముగిసే సమయానికి 166/3తో కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ జట్టుకి 227 పరుగుల ఆధిక్యం లభించిన విషయం తెలిసిందే. దాంతో ఓవరాల్‌గా 393 పరుగుల ఆధిక్యంలో టీమిండియా ఉంది. 450-500 టార్గెట్‌ను బంగ్లాదేశ్ ముందు భారత్ జట్టు నిర్దేశించే అవకాశం ఉంది.

గురువారం ప్రారంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకి ఆలౌటైంది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆడిన బంగ్లాదేశ్ టీమ్ 149 పరుగులకే కుప్పకూలగా.. టీమిండియాకి 227 పరుగుల ఆధిక్యం లభించింది. అయినప్పటికీ బంగ్లాదేశ్ టీమ్‌ను ఫాలో ఆన్ ఆడించని రోహిత్ సేన రెండో ఇన్నింగ్స్ ఆడుతోంది. ఇటీవల బంగ్లాదేశ్‌ను తమ సొంతగడ్డపై ఫాలో ఆన్ ఆడించిన పాకిస్థాన్.. భారీగానే మూల్యం చెల్లించుకుంది. దాంతో భారత్ జట్టు జాగ్రత్తపడినట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here