ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద ఉన్న బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్(rajinikanth)కూడా ఒకరు. ఏడు పదుల వయసులో కూడా యువ హీరోలకి ధీటుగా రాణిస్తూ  రజనీ మానియాకి ఎక్స్ పైరీ డేట్ ఉండదనే మాటని నిజం చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే వచ్చే నెల అక్టోబర్ పది న వేట్టయాన్  తో వరల్డ్ వైడ్ గా అడుగుపెట్టబోతున్నాడు. రీసెంట్ గా ఆ మూవీ  ఆడియో లాంచ్ కార్యక్రమం  చెన్నై వేదికగా  జరిగింది.

అందులో రజనీ మాట్లాడుతు సందేశాత్మక చిత్రం  తెరకెక్కించాలని దర్శకుడు జ్ఞానవేల్(gnanavel raja)కి చెప్పడంతో  వెంటనే  వేట్ట యాన్  కథ తో వచ్చాడు. ఇది ప్రజలంతా సెలబ్రేట్ చేసుకునే చిత్రం. ఇందులో అన్ని భావోద్వేగాలు ఉంటాయి.సినిమా విజయం సాధించకపోతే దాని తర్వాత వచ్చే సినిమా అయినా ఎలాగైనా విజయం  సాధించాలనే టెన్షన్ ఉంటుంది.అదే విధంగా ఒక సూపర్ హిట్ సినిమా తర్వాత వచ్చే సినిమా కూడా దాన్ని మించి విజయం సాధించాలనే టెన్షన్ కూడా  ఉంటుంది. ప్రస్తుతం నేను ఆ టెన్షన్ లోనే ఉన్నాను. జైలర్ ని ఆదరించినట్టే దీన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాని చెప్పడంతో పాటుగా వేట్టయాన్ కి మ్యూజిక్ ని అందించిన  అనిరుద్(anirudh)నాకు కొడుకుతో సమానం అని చెప్పుకొచ్చాడు. 

ఇక కంగువా(kanguva)కూడా అక్టోబర్ 10 నే రిలీజ్ డేట్ అవుతున్న నేపథ్యంలో ఆ విషయంపై కూడా మాట్లాడుతు వేట్టయాన్ ని  పూజా కార్యక్రమాలతో ప్రారంభించినట్టే అక్టోబర్ 10 డేట్ ని ప్రకటించాలనుకున్నాం. కానీ నిర్మాణ సంస్థపై ఉన్న ఆర్ధిక ఒత్తిడులు వల్ల డేట్ ని ప్రకటించలేకపోయామని  చెప్పుకొచ్చాడు.ఇక  బాలీవుడ్ బిగ్ బి అమితాబ్, వర్సటైల్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్ , మంజు వారియర్, రానా, దుషార విజయన్ వంటి వాళ్ళు వేట్టయాన్ లో ప్రధాన పాత్రల్లో చేస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here