యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr)ఈ నెల 27 న దేవర(devara)తో  వరల్డ్ వైడ్ గా అడుగుపెడుతున్నాడు.రిలీజ్ కి ఇంకా కొద్దీ రోజులే వ్యవధి ఉండటంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా దేవర ఫెస్టివల్ ప్రారంభం అయిందని చెప్పవచ్చు. చిత్ర యూనిట్ కూడా క్షణం తీరిక కూడా లేకుండా ప్రమోషన్స్ ని నిర్వహిస్తుంది. వాటిల్లో ఎన్టీఆర్ తో పాటు చిత్ర ప్రధాన తారాగమంతా పాల్గొంటూ దేవరకి సంబంధించిన విశేషాలని ప్రేక్షకులతో  పంచుకుంటున్నారు. తాజాగా  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవర టీం కి  ఒక తీపి కబురుని చెప్పింది.

దేవర టికెట్ల ధరలని పెంచుకోవడానికి వీలుగా ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. మల్టీప్లెక్స్ లలో ఒక్కో టికెట్ పై నూట ముప్పై ఐదు రూపాయలు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ టికెట్ పై నూట పది రూపాయలు, లోయర్ క్లాస్ పై అరవై రూపాయిల వరకు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. రిలీజ్ రోజున పన్నెండు గంటల కి ప్రారంభం అయ్యే మిడ్ నైట్ షోతో పాటు  మొత్తం ఆరు షో లు ప్రదర్శించుకునేందుకు వీలుగా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాకపోతే ఆ మరుసటి రోజు నుంచి అంటే ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి వరుసగా తొమ్మిది రోజుల పాటు రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకోవచ్చని ఉత్తర్వులలో చెప్పింది. మరి పెరిగిన రేట్లతో దేవర రికార్డుల పరంగా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here