ఏపీ టెట్ హాల్ టికెట్లు – ఇలా డౌన్లోడ్ చేసుకోండి:

  • ఏపీ టెట్ అభ్యర్థులు మొదటగా https://aptet.apcfss.in/# వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో కనిపించే AP TET Hall Tickets(July) 2024 అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ అభ్యర్థి రిజిస్ట్రేషన్ ఐడీ, పుట్టిన తేదీతో పాటు Verfication Code ను ఎంట్రీ చేయాలి.
  • సబ్మిట్ చేస్తే టెట్ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
  • పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలంటే హాల్ టికెట్ ఉండాల్సిందే. భవిష్యత్ అవసరాల కోసం కూడా భద్రంగా ఉంచుకోవాలి.

ఇక టెట్ పరీక్షలో ఓసీ అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక బీసీ అభ్యర్థులు 50 శాతం, ఎస్టీ, ఎస్సీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ 40 శాతం అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో ఒక్కసారి అర్హత సాధిస్తే ఏ డీఎస్సీ పరీక్షనైనా రాసుకోవచ్చు. అర్హత సాధించిన అభ్యర్థులు ఎన్నిసార్లు అయినా టెట్ రాయవచ్చు. ఎక్కువ స్కోర్ ఉన్న టెట్ పరీక్షనే పరిగణనలోకి తీసుకుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here