29 ఏళ్ల మహిళ మృతదేహాన్ని 30కి పైగా ముక్కలుగా కోసి రిఫ్రిజిరేటర్లో కుక్కిన దారుణం బెంగళూరులో బయటపడింది. ఈ ఘటన వ్యాలికావల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో జరిగిందని పోలీసులు శనివారం తెలిపారు. ఈ రోజు ఉదయం ఆ ఇంటి నుంచి భరించలేని దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులు, ఇతర అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులకు ఆ ఇంట్లో 30 ముక్కలుగా నరికిన ఒక యువతి మృతదేహం ఫ్రిజ్ లో కనిపించింది.
Home International Bengaluru horror: బెంగళూరులో దారుణం; మహిళను 30 ముక్కలుగా నరికి.. ఫ్రిజ్ లో కుక్కి..-bengaluru horror...