పెంచికలపేటలోని బాలాజీ రైస్ మిల్లుకు గత రెండు సంవత్సరాలకు గానూ (2021–22, 2022–23) 6,339 టన్నుల ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం కేటాయించారు. దానికి ప్రకారం మిల్లింగ్ అనంతరం మిల్లు యజమానులు.. 4,310 టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాల్సి ఉంది. కానీ సంబంధిత మిల్లు నిర్వాహకులు కేవలం 1,889 టన్నులు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. మిగతా 3,521 టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా.. బయట ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం నుంచి పలుమార్లు ఆదేశాలు వచ్చినా సీఎంఆర్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడంతో.. ఆఫీసర్లు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here