• rrbapply.gov.in వద్ద ఆర్ఆర్బీ అప్లై అధికారిక వెబ్సైట్​ని సందర్శించండి.
  • హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న ఆర్ఆర్బీ ఎన్టీపీసీ యూజీ రిక్రూట్మెంట్ 2024 లింక్​పై క్లిక్ చేయండి.
  • అభ్యర్థులు అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • ఆ తర్వాత అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి.
  • అప్లికేషన్ ఫామ్ నింపి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • సబ్మిట్ బటన్​పై క్లిక్ చేసి పేజీని డౌన్​లోడ్ చేసుకోండి.
  • తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ఉంచండి.

ఆర్ఆర్బీ ఎన్టీపీసీ దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, మహిళ, దివ్యాంగులు, ట్రాన్స్​జెండర్, మైనార్టీలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఈబీసీ) కేటగిరీ అభ్యర్థులకు రూ.250. మిగతా అన్ని అప్లికేషన్లకు ఫీజు రూ.500. అభ్యర్థులు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)కు హాజరైనప్పుడు దరఖాస్తు ఫీజును పాక్షికంగా రీఫండ్ చేస్తారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్​ని చూడవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here