ఈ నెల 27 న వరల్డ్ వైడ్ గా మొత్తం ఐదు లాంగ్వేజెస్ లో ఎన్టీఆర్(ntr)దేవర(devara)గా అడుగుపెట్టబోతున్నాడు. దీంతో ప్రమోషన్స్ చాలా వేగంగానే జరుగుతున్నాయి.వాటిల్లో  దేవర గురించి ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ(koratala siva)హీరోయిన్ జాన్వీ కపూర్(jahnvi kapoor),ప్రతి నాయకుడు సైఫ్ అలీ ఖాన్(saif ali khan)చెప్తున్న  విశేషాలు  ఎన్టీఆర్ అభిమానులనే కాకుండా ప్రేక్షకులకి కూడా సినిమా మీద ఎంతో ఆసక్తిని కలగచేస్తున్నాయి. లేటెస్ట్ గా  దేవరకి ఫొటోగ్రఫీ ని అందించిన రత్నవేలు కూడా కొన్ని గూస్ బంప్స్ వ్యాఖ్యలు చేసాడు. 

దేవర లో భారీ విఎఫ్ఎక్స్ షాట్స్ ని మ్యాచ్ చేసే కలర్ గ్రేడింగ్ షాట్స్ చెయ్యడానికి  ముప్పై నిద్ర లేని రాత్రులు గడపాల్సి వచ్చింది. అదే విధంగా  ఐమాక్స్, ఎక్స్ డి, ప్రీమియర్ లార్జ్ ఫార్మాట్ వంటి కంటెంట్ ని కూడా అందచేశాం. దేవర మీది, చూసి ఎంజాయ్ చెయ్యండంటూ ట్విట్టర్ వేదికగా తెలిపాడు. అదే విధంగా దేవరలోని కొన్ని ఐకానిక్ షాట్స్. షూటింగ్ విజువల్స్ ని  కూడా షేర్ చేసాడు.

కెమెరా మెన్ గా  రత్నవేలు కి ఇండియన్ చిత్ర సీమలో  ఒక ప్రత్యేక స్థానం ఉంది. తమిళ చిత్ర రంగానికి చెందిన రత్నవేలు తెలుగులో మహేష్ బాబు 1 నేనొక్కడ్నే, సరిలేరు నీకెవ్వరు, రామ్ చరణ్ రంగ స్థలం, చిరంజీవి ఖైదీ నెంబర్ 150 , సైరా నరసింహారెడ్డి వంటి పలు చిత్రాలకి చేసాడు .ఇక దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 22 న హైదరాబాద్ లో అభిమానుల సమక్షంలో  ఘనంగా జరగనుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here