4 రోజులు ఆట సాగిందిలా

బంగ్లాదేశ్ టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే చేతులెత్తేసింది. ఆ జట్టులో షకీబ్ అల్ హసన్ మాత్రమే 32 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు పడగొట్టాడు. దాంతో 227 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకున్న టీమిండియా.. బంగ్లాదేశ్‌ను ఫాలో ఆన్ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసింది.

రెండో ఇన్నింగ్స్‌లో శుభమన్ గిల్ (119 నాటౌట్: 176 బంతుల్లో 10×4, 4×6), రిషబ్ పంత్ (109: 128 బంతుల్లో 13×4, 4×6) సెంచరీలు బాదేశారు. దాంతో శనివారం 287/4 వద్ద భారత్ ఇన్నింగ్స్‌ను రోహిత్ శర్మ డిక్లేర్ చేశాడు. అప్పటికే తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 227 పరుగుల్ని కలుపుకుని ఓవరాల్‌గా 515 పరుగుల లక్ష్యం బంగ్లాదేశ్ ముందు టీమిండియా నిలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here