ప్రస్తుతం ఎక్కడా చూసినా ‘దేవర’ మేనియానే కనిపిస్తోంది. సెప్టెంబర్ 27న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల బుకింగ్స్ ఓపెన్ కాగా, సూపర్ రెస్పాన్స్ వస్తోంది. విడుదల తేదీ దగ్గర పడటంతో.. ప్రమోషన్స్ మరింత ఊపందుకున్నాయి. ఈరోజు(సెప్టెంబర్ 22) సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. అంతేకాదు, ఈవెంట్ స్టార్ట్ కావడానికి కొద్దిగంటల ముందు తాజాగా రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. (Devara Release Trailer)

“నిన్న రేత్రి ఒక పీడకల వచ్చి ఉండాది జోగుల.. సంద్రం మళ్ళీ ఎరుపెక్కి నిజంగా ఎర్రసముద్రం అయినట్టు.. అదీ నా చేతుల మీదుగా అయినట్టు కనిపించి ఉండాది” అంటూ ఎన్టీఆర్ వాయిస్ తో ట్రైలర్ ప్రారంభమైంది. అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషన్ సీన్స్ తో రూపొందిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. దేవర, వర పాత్రల్లో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించాడు. ట్రైలర్ లో విజువల్స్, డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయి. ట్రైలర్ చివరిలో ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఫ్యాన్స్ నచ్చేలా ఈ రిలీజ్ ట్రైలర్ ను కట్ చేశారు. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయి అనడంలో సందేహం లేదు. అయితే ఈ రిలీజ్ ట్రైలర్ లో గతంలో విడుదలైన గ్లింప్స్, ట్రైలర్ లో చూసేసిన షాట్స్ కూడా ఉన్నాయి. వాటిని రిపీట్ చేయకుండా.. ట్రైలర్ ను పూర్తిగా ఫ్రెష్ గా కట్ చేస్తే ఇంకా బాగుండేది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here