పూణెలో అనా సెబాస్టియన్ మరణం..
ఇండియాలో వర్క్ కల్చర్‌పై గత 3,4 రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. ఇందుకు కారణం.. అనా సెబాస్టియన్ అనే 26ఏళ్ల మహిళ! పూణెకు చెందిన ఓ ప్రముఖ కంపెనీలో పని చేస్తూ, వర్క్ ప్రెజర్ తట్టుకోలేక ఆమె మరణించిందని, ఆనా తల్లి చెప్పారు. ఈ విషయంపై కంపెనీకి ఓపెన్ లెటర్ రాశారు. తన బిడ్డ రాత్రింపగళ్లు, తిండి లేకుండా, నిద్ర లేకుండా పని చేసిందని అనా తల్లి చెప్పారు. వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉందని చాలాసార్లు తనకు చెప్పినట్టు పేర్కొన్నారు.