కేంద్ర ఏజెన్సీతో ద‌ర్యాప్తు జరపాలి..

ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌కు ఈ విష‌యం చాలా ముఖ్య‌మైన‌ద‌ని, మ‌త‌ర‌మైన ఆచారాల ప‌విత్ర‌త‌ను కాపాడేందుకు, ఆల‌య ప‌రిపాల‌న‌పై విశ్వాసాన్ని పున‌రుద్ధ‌రించ‌డానికి అత్యున్న‌త న్యాయ‌స్థానం త‌క్ష‌ణ‌మే దృష్టి పెట్టాల‌ని పిటిష‌న్‌లో కోరారు. ఈ వివాదానికి సంబంధించిన నేర‌పూరిత కుట్ర‌, అవినీతిపై ద‌ర్యాప్తు చేయ‌డానికి సీబీఐ లేదా మ‌రొక స్వతంత్ర కేంద్ర ఏజెన్సీ ద్వారా ద‌ర్యాప్తు చేయాల‌ని కోరారు. పార‌ద‌ర్శ‌క‌త‌, మ‌త‌ప‌ర‌మైన ఆచారాల‌కు క‌ట్టుబ‌డి ఉండేలా ఆల‌యాలు, పుణ్య‌క్షేత్రాల నిర్వ‌హ‌ణ‌ను ప‌ర్య‌వేక్షించ‌డానికి రిటైర్డ్ సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తి లేదా హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిని నియ‌మించాల‌ని పిటిష‌న‌ర్ కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here