తెలుగు ప్రేక్షకులకు పీపుల్స్ స్టార్ అంటే ఆర్. నారాయణమూర్తినే. ఆ ట్యాగ్ తో ఆయన పేరుని తప్ప వేరే ఎవరి పేరుని ఊహించుకోలేము. సామాన్యుడిగా సినీ పరిశ్రమలోకి పెట్టి, అసామాన్యుడిగా ఎదిగారు నారాయణమూర్తి. ప్రజలను చైతన్యవంతం చేసే ఎన్నో సినిమాలు చేసి.. పీపుల్స్ స్టార్ అనిపించుకున్నారు. అలాంటిది ఇప్పుడు యువ హీరో సందీప్ కిషన్ తన పేరుకి ముందు ‘పీపుల్స్ స్టార్’ అనే ట్యాగ్ ని తగిలించుకొని వివాదానికి తెరదీశాడు. (Sundeep Kishan)

‘ధమాకా’ దర్శకుడు త్రినాధరావు నక్కినతో సందీప్ కిషన్ ‘మజాకా’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ నుంచి తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదలైంది. ఈ పోస్టర్ లో పెళ్లికొడుకులా ముస్తాబైన సందీప్ లుక్ బాగుంది కానీ.. ఆయన పేరుకి ముందు ‘పీపుల్స్ స్టార్’ అనే ట్యాగే ఆశ్చర్యం కలిగిస్తోంది. (Majaka Movie)

ఈ మధ్య పలువురు యువ హీరోలు తమ పేరుకి ముందు ఏదోక స్టార్ అనే ట్యాగ్ ని తగిలించుకుంటున్నారు. అందుకే సందీప్ కూడా తనకి మాత్రం ఏం తక్కువని ఒక ట్యాగ్ తగిలించుకోవాలి అనుకున్నట్టున్నాడు. అలా అనుకోవడం వరకు ఓకే గానీ.. ఆయన ఎంచుకున్న ట్యాగే వివాదాస్పదంగా మారింది. సందీప్ కిషన్ పీపుల్స్ స్టార్ ఎలా అవుతాడంటా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పీపుల్స్ స్టార్ అంటే ఆర్. నారాయణమూర్తి ఒక్కరే అని, ఆ ట్యాగ్ ని వాడుకోవడం కరెక్ట్ కాదంటూ.. సందీప్ పై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. మరి ‘పీపుల్స్ స్టార్’ ట్యాగ్ పెట్టుకోవాలని సందీపే అనుకున్నాడో లేక ఎవరైనా ఐడియా ఇచ్చారో గానీ.. ఇదైతే అనాలోచిత చర్య అని చెప్పవచ్చు. మరి సందీప్ కిషన్ ఈ విమర్శలతోనైనా మేల్కొని.. వీలైనంత త్వరగా దిద్దుబాటు చర్యలు చేపడతాడేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here