సినిమా ఇండస్ట్రీలో వివాదాలు, లైంగిక వేధింపులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఎవరు ఎవరిమీద ఆరోపణలు చేస్తారో, ఎప్పుడు ఎవరి కేసు వెలుగులోకి వస్తుందీ అనే విషయం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలి కాలంలో జానీమాస్టర్‌, శ్రష్టివర్మ కేసు ఎంతో సంచలనం సృష్టించింది. సోషల్‌ మీడియాలో, మీడియాలో దీనిపైనే ఎక్కువగా చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే.. జస్టిస్‌ హేమ కమటీ రిపోర్ట్‌ మలయాళ ఇండస్ట్రీలో సంచలనం సృస్టించిన విషయం తెలిసిందే. మలయాళ చిత్ర పరిశ్రమలోని మహిళలపై ఎలాంటి లైంగిక వేధింపులు జరుగుతున్నాయో ఆ రిపోర్ట్‌ బయటపెట్టింది. ఈ నివేదిక బయటికి రాగానే ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి ఫిర్యాదులు చేస్తున్నారు. 

ఈ క్రమంలోనే మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఓ మహిళ.. ప్రముఖ నటుడు సిద్ధిఖ్‌ తనను లైంగికంగా వేధించాడంటూ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనిపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నించగా, కోర్టు బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో సిద్ధిఖ్‌ పరార్‌ అయ్యారు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొన్నదేమిటంటే.. తనకు ఓ తమిళ సినిమాలో అవకాశం ఇప్పిస్తానని చెప్పి తన లైంగిక అవసరాలు తీర్చమని కోరాడు. దానికి ఆ మహిళ ఒప్పుకోకపోవడంతో ఓ హోటల్‌లో తనపై అత్యాచారం చేశాడని తెలిపింది. ఇది 2016లో జరిగిందని ఫిర్యాదులో పేర్కొంది. 

మలయాళ ఇండస్ట్రీలో సిద్ధిఖ్‌కి నటుడుగా చాలా మంచి పేరు ఉంది. 61 ఏళ్ళ సిద్ధిఖ్‌ 1980లో చిత్ర పరిశ్రమలోకి నటుడుగా అడుగుపెట్టారు. పలు భాషల్లో 350కి పైగా సినిమాల్లో నటించారు. 45 ఏళ్ళ సినీ కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. తెలుగులో రాజేష్‌ టచ్‌రివర్‌ రూపొందించిన ‘నా బంగారు తల్లి’ చిత్రంలో కీలకమైన పాత్ర పోషించారు సిద్ధిఖ్‌. వ్యభిచారులను సప్లై చేసే వ్యక్తిగా, హీరోయిన్‌కి తండ్రిగా ఈ సినిమాలో నటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here