ఇటీవలికాలంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో హైకోర్టు ముగ్గురికి బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న ఈ ముగ్గురి పేర్లను ఇప్పుడు ఛార్జ్‌షీట్‌ నుంచి తొలగించారు. కేశవమూర్తి, కార్తీక్‌, నిఖిల్‌.. ఈ ముగ్గురికి బెయిల్‌ మంజూరు అయింది. వీరిలో కేశవమూర్తి హత్య జరిగిన వెంటనే పోలీసులకు లొంగిపోయాడు. అయితే అతని పేరును కూడా ఛార్జ్‌షీట్‌ నుంచి తొలగించారు. ఈ కేసులో కన్నడ నటి పవిత్రగౌడ ఏ1గా, హీరో దర్శన్‌ 2గా ఉన్నారు. మొత్తం 17 మంది ఈ కేసులో అరెస్ట్‌ చేశారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు సాక్ష్యాలన్నీ దర్శన్‌కి వ్యతిరేకంగానే ఉన్నాయి. దర్శన్‌ని బెయిల్‌ ద్వారా బయటికి తీసుకు రావాలని అతని భార్య తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, ఫలితం లేదు. 

మొదట నిందితులందర్నీ పరప్పన్‌ అగ్రహారం జైలులో ఉంచారు. అక్కడ దర్శన్‌కి కల్పించిన సౌకర్యాలపై తీవ్ర విమర్శలు రావడంతో అతనొక్కడినే బళ్ళారి జైలుకి తరలించారు. ఈ కేసు విచారణను పోలీసులు వేగవంతం చేయడం వల్లే ముగ్గురికి బెయిల్‌ లభించింది. మొత్తం 17 మందిని అరెస్ట్‌ చేసినప్పటికీ మరికొంతమంది అనుమానితుల్ని పిలిపించి విచారించారు. అయితే వారికి ఈ కేసుతో సంబంధం లేదని భావించి వదిలేశారు. అయితే అలా వదిలేసిన వారందరిపైనా పోలీసుల నిఘా ఉంది. ఇప్పటికే పోలీసుల విచారణ పూర్తయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ కేసుకు సంబంధించి ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here