వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో మెప్పిస్తోన్న నవ దళపతి సుధీర్‌ బాబు కథానాయకుడిగా రూపొందుతోన్న సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ ‘జటాధర’.  అనౌన్స్‌మెంట్‌ నుంచి పాన్‌ ఇండియా సినీ ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ అంచనాలు క్రియేట్‌ చేసుకున్న ఈ చిత్రం 2025 శివరాత్రి విడుదలకు సన్నద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి విడుదలైన కొత్త పోస్టర్‌ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింతగా పెంచుతోంది. పౌరాణిక, ఫాంటసీ, డ్రామా అంశాల కలయికగా ఈ చిత్రం తెరకెక్కుతోందని విడుదలైన పోస్టర్‌ చూస్తుంటేనే అర్థమవుతుంది. అలాగే అందులో సుధీర్‌ బాబు సరికొత్త లుక్‌తో, శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తుంది. 

ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్‌ బాబు ప్రొడక్షన్‌ బ్యానర్‌పై జటాధర చిత్రం ఇండియన్‌ సినిమాల్లో ఓ బెంచ్‌ మార్క్‌ను క్రియేట్‌ చేసేలా రూపొందుతోంది. ఈ తరహా చిత్రాల రూపకల్పనకు ఇది నాంది పలికేలా కనిపిస్తుంది. సూపర్‌ నేచురల్‌ శక్తితో అదరగొట్టే లుక్‌లో సుధీర్‌ బాబు కనిపిస్తున్నారు. అభిమానులు పోస్టర్‌ను చూసి సినిమాలో తన పాత్ర ఎలా ఉండబోతుందనే దానిపై ఇప్పటికే ఉహాగానాలు చేస్తున్నారు. ఈ విలక్షణమైన సినిమాను ఎప్పుడెప్పుడు సిల్వర్‌ స్క్రీన్‌పై చూద్దామా! అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

నవ దళపతి సుధీర్‌ బాబు మాట్లాడుతూ ‘‘‘జటాధర’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కు వచ్చిన ఆదరణ చూసి ఆశ్చర్యపోయాను. ఇంత గొప్ప స్పందన రావడంతో సంతోషమేసింది. ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. ఈ సినిమాలోకి అడుగు పెట్టటం అనేది ఓ సరికొత్త ప్రపంచాన్ని నాకు పరిచయం చేసింది. నాకు ఇది ఎప్పటికీ మరచిపోలేని అనుభవం. శాస్త్రీయత, పౌరాణిక అంశాల కలయిక స్క్రిప్ట్‌ను రాశారు. ఈ రెండు జోనర్స్‌కు చెందిన ప్రపంచాలను రేపు ఆడియెన్స్‌ వెండితెరపై చూస్తున్నప్పుడు ఓ సరికొత్త సినిమా అనుభూతిని పొందుతారు’’ అన్నారు. 

భారీ బడ్జెట్‌తో అంచనాలను మించేలా ఓ అద్భుతమైన సరికొత్త చిత్రాన్ని రూపొందించటానికి నిర్మాతలు ప్రేరణ అరోరా, శివివన్‌ నారంగ్‌, నిఖిల్‌ నంద, ఉజ్వల్‌ ఆనంద్‌ అహర్నిశలు కష్టపడుతున్నారు. సినిమాలో హీరోయిన్‌గా ఓ ప్రముఖ బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ నటించనుంది. అలాగే ప్రతినాయకి పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ నటించనుంది. ఆ వివరాలను మేకర్స్‌ త్వరలోనే ప్రకటించనున్నారు. 

ప్రస్తుతం జటాధర సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. పాన్‌ ఇండియా ప్రేక్షకులను ఈ చిత్రం అలరించనుందని సెకండ్‌ పోస్టర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. 2025లో విడుదలకు సిద్ధమవుతున్న జటాధర సినిమాతో ఓ అద్భుతమైన అనుభూతిని ఆస్వాదించటానికి సిద్ధంగా ఉండండి. హరోంహరతో సూపర్‌ హిట్‌ కొట్టిన సుధీర్‌ బాబు అక్టోబర్‌ 11న మా నాన్న సూపర్‌ హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here