కర్ణాటకతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహాలక్ష్మి హత్య కేసులో బెంగళూరు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మూడు దశల్లో దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. నేపాల్ కి చెందిన మహాలక్ష్మి హత్య కేసులో మొదటి మూడు ఆధారాలు విచారణకు ముఖ్యమనవని పోలీసులు భావిస్తున్నారు. అవి ఏంటి అంటే మొబైల్ రిట్రీవ్, టవర్ డంప్, సీడీఆర్ రికార్డులు. మహాలక్ష్మి మెుబైల్ ఉన్న చాట్, ఆడియో కాల్స్, ఏ నెట్ వర్క్ కింద మాట్లాడిందనే సమాచారాన్ని సేకరించే పనిలో బెంగళూరు పోలీసులు ఉన్నారు. మహాలక్ష్మి హత్య కేసులో పోలీసులకు ఎక్కువగా సీసీటీవీల క్లిప్పింగ్స్ పై కన్ను వేశారు. మహాలక్ష్మి ఎప్పుడు ఇంటికి వచ్చిందో సీసీటీవీల ద్వారా గుర్తించారు. మహాలక్ష్మి వెనుక ఆమె ఇంటి వరకు ఎవరెవరు వచ్చారో కూడా బెంగళూరు పోలీసులు తనిఖీ చేశారు. మహాలక్ష్మిని దారుణంగా హత్య చేసిన తరువాత ఆమె మృతదేహాన్ని ఛిద్రం చేశారు. మహాలక్ష్మి శవాన్ని ఏకంగా 59 ముక్కలుగా నరికేశారు. మహాలక్ష్మిని లైంగిక సంబంధం కారణాలతో హత్య చేశారా? ఆమెపై లైంగిక దాడి జరిగిందా?, హత్యకు గల కారణాలు ఏమిటి అని వెలికితీస్తామని పోలీసు అధికారులు అంటున్నారు. మహిళ శవాన్ని ముక్కలుగా నరికేసి ఆమె శరీరంలోని ముక్కలను ఫ్రిడ్జ్ లో పెట్టడం కలకలం రేపుతోంది. కూతురు మహాలక్ష్మి మృతదేహాన్ని ఫ్రిడ్జ్ లో చూసి ఆమె తల్లి మీనా రాణా హడలిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here