జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘దేవర’ (Devara). భారీ అంచనాలతో ఈ చిత్రం సెప్టెంబర్ 27న థియేటర్లలో అడుగుపెట్టనుంది. అడ్వాన్స్ బుకింగ్స్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దేవర దూసుకుపోతోంది. (Devara Bookings)

‘దేవర’ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తెలుగునాట అత్యధిక థియేటర్లలో భారీస్థాయిలో చిత్రం విడుదలవుతోంది. ఈ క్రమంలో నిర్మాత నాగవంశీ.. ఎన్టీఆర్ అభిమానులకు సోషల్ మీడియా వేదికగా ఒక రిక్వెస్ట్ చేశాడు.

“తారక్ అన్న చాలా గ్యాప్ తర్వాత మంచి ఎమోషనల్ మాస్ కంటెంట్ తో వస్తున్నారు. మనకి మంచి కంటెంట్‌ని అందించడానికి ఆయన తన వంతు కృషి చేశారు. మా వైపు నుండి మేము కూడా భారీస్థాయిలో చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. అయితే అభిమానులకు మాదో విన్నపం. మీరు కూడా బాధ్యతగా, ప్రశాంతంగా ఉండండి. అనవసరమైన ఫ్యాన్ వార్‌లను చేయకండి. ఈ ఫ్యాన్ వార్స్ కొంత తాత్కాలిక కిక్ ఇవ్వవచ్చు, కానీ తరువాత అది మన హీరోల చిత్రాలపై ప్రభావం చూపుతుంది. కాబట్టి అభిమానులందరినీ అభ్యర్థిస్తున్నాము,  ఫ్యాన్ వార్స్ ఆపేసి , ఈ ఆనందాన్ని ఆస్వాదిద్దాం. ఈ ఫిల్మ్ తో అయినా సోషల్ మీడియాలో ఈ ఫ్యాన్ వార్‌లను ఆపాలని, మన సినిమాలపై నెగిటివిటీని స్ప్రెడ్ చేయవద్దని ప్రతిజ్ఞ చేద్దాం. అంతేకాదు, ఫస్ట్ స్క్రీనింగ్‌లో సినిమా చూసే అభిమానులు.. సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసి, ఆ తర్వాత సినిమా చేసేవరకు థ్రిల్ కలగకుండా చేయకండి. ఎంతో ప్రేమతో, శ్రద్ధతో తారక్ అన్నకు మరపురాని బ్లాక్‌బస్టర్‌ని అందిద్దాం.” అంటూ సోషల్ మీడియా వేదికగా నాగవంశీ రాసుకొచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here