Thursday Motivation: చీమ, దోమ, ఏనుగు, పిచ్చుకలు, పిల్లలు, పెద్దలు… ఇలా మీ చుట్టూ ఉండే ఏ జీవి నుంచైనా మంచి నేర్చుకునేందుకు ఏమాత్రం సంకోచించకండి. మీకు ఎదురుపడిన ఏ జీవినీ చులకనగా చూడకుండా దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకునేందుకు ప్రయత్నించండి. ఇక్కడ గద్ద నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని జీవిత పాఠాలను ఇచ్చాము. మీరు ఎప్పుడైనా గద్దను చూడండి. ఆకాశమే హద్దుగా ఎగిరిపోతుంది. అన్ని పక్షుల కంటే ఎత్తుగా ఎగిరేందుకు ఇష్టపడుతుంది. దాని దృష్టి చాలా తీక్షణంగా ఉంటుంది. భయమంటే ఎరగనట్టు ఎగురుతుంది. పట్టుదలతో ముందుకు సాగుతుంది. స్వేచ్చగా ఉండేందుకు ఇష్టపడుతుంది. ఇలాంటి పక్షుల నుంచి మనము నేర్చుకునే జీవిత పాఠాలు ఎన్నో ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here