దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళితో సినిమా చేసిన హీరోకి.. నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవ్వడమనేది ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తుంది. ఈ నెగటివ్ సెంటిమెంట్.. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తోనే మొదలైంది. రాజమౌళి డైరెక్ట్ చేసిన మొదటి సినిమా ‘స్టూడెంట్ నెం.1’లో ఎన్టీఆర్ హీరోగా నటించాడు. ఈ సినిమా సూపర్ హిట్ కాగా.. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన ‘సుబ్బు’ ఫ్లాప్ అయింది. ఇక రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన రెండో సినిమాలోనూ ఎన్టీఆరే హీరోగా నటించాడు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వగా.. ఆ తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన ‘ఆంధ్రావాలా’ డిజాస్టర్ అయింది. ఇలా ఎన్టీఆర్ తో ఈ నెగటివ్ సెంటిమెంట్ మొదలుకాగా.. రాజమౌళి సినిమాల్లో నటిస్తున్న మిగతా హీరోలు కూడా దానిని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు.

రాజమౌళి డైరెక్షన్ లో ‘సై’ సినిమా చేసిన నితిన్ కి.. ఆ వెంటనే ‘అల్లరి బుల్లోడు’ రూపంలో ఫ్లాప్ ఎదురైంది. రాజమౌళితో ‘ఛత్రపతి’ వంటి విజయవంతమైన సినిమా చేసిన ప్రభాస్.. ఆ తర్వాత ‘పౌర్ణమి’తో పరాజయం చూశాడు. ‘విక్రమార్కుడు’ తర్వాత రవితేజకు ‘ఖతర్నాక్’, ‘యమదొంగ’ తర్వాత ఎన్టీఆర్ కు ‘కంత్రి’, ‘మగధీర’ తర్వాత రామ్ చరణ్ కు ‘ఆరెంజ్’, ‘మర్యాద రామన్న’ తర్వాత సునీల్ కు ‘అప్పల్రాజు’, ‘ఈగ’ తర్వాత నానికి ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’.. ఇలా అందరి హీరోలకు రాజమౌళి సినిమా తర్వాత పరాజయాలు ఎదురయ్యాయి. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ కి కూడా ‘సాహో’తో నిరాశ ఎదురైంది.

ఇక రాజమౌళి గత చిత్రం ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు హీరోలుగా నటించారు. ఇప్పటికే రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ‘ఆచార్య’తో ప్రేక్షకులను పలకరించగా అది డిజాస్టర్ అయింది. దీంతో ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ‘దేవర’ (Devara)పై అందరి దృష్టి పడింది. ఈ సినిమా రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న రాజమౌళి నెగటివ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేసే అవకాశం కనిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఈ చిత్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈమధ్య కాలంలో మరే సినిమాకి జరగనంత సెలబ్రేషన్ దేవరకు జరుగుతోంది. సెన్సార్ టాక్ కూడా చాలా పాజిటివ్ గా ఉంది. యాక్షన్, ఎమోషన్స్ తో కూడిన ఈ చిత్రాన్ని కొరటాల అద్భుతంగా మలిచాడని అంటున్నారు. ఇండస్ట్రీ వర్గాలతో పాటు, బయ్యర్లు కూడా ఈ మూవీ రిజల్ట్ పట్ల ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు.. దేవర బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తుంటే.. తన సినిమాతో మొదలైన రాజమౌళి సెంటిమెంట్ కి.. తన సినిమాతోనే ఎన్టీఆర్ శుభం కార్డు వేసేలా ఉన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here