‘నేను జిల్లాల పర్యటనకు వెళ్లినపుడు ఒకరోజు పూర్తిగా స్కూళ్ల పరిశీలనకు కేటాయిస్తున్నాను. వాస్తవాలను తెలుసుకోవడానికి స్కూళ్లను తనిఖీ చేస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాల మెరుగుదలకు మౌలిక సదుపాయాల కల్పనతోపాటు తల్లిదండ్రులు, టీచర్లు, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం వహించాలి. ఇందుకోసం పేరెంట్ –టీచర్స్ సమావేశాలు నిర్వహిస్తాం. ముఖ్యమంత్రి నుంచి వార్డు మెంబరు వరకు అందరం ఈ సమావేశాలకు హాజరై పాఠశాలల మెరుగుదలకు వారి సలహాలు తీసుకుంటాం. స్కూలు గోడకూలి విద్యార్థి మృతిచెందిన ఘటనపై అధికారుల నుంచి నివేదిక కోరాం. నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’ లోకేష్ స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here