తనని కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్ అని ఎందుకు అంటారో ‘దేవర’ (Devara)తో మరోసారి రుజువు చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). రేపు (సెప్టెంబర్ 27) థియేటర్లలో అడుగు పెట్టనున్న దేవర మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా నార్త్ అమెరికాలో సంచలన రికార్డులు సృష్టిస్తోంది.

మరికొద్ది గంటల్లో నార్త్ అమెరికాలో ‘దేవర’ ప్రీమియర్స్ పడనున్నాయి. ప్రీమియర్ ప్రీ సేల్స్ పరంగా ఇప్పటికే 2.5 మిలియన్ మార్క్ ని అందుకుంది. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే ప్రీమియర్స్ తో 3 మిలియన్ మార్క్ ని అందుకొని.. టాప్-3 లోకి ఎంటర్ అవ్వడం ఖాయమని చెప్పవచ్చు. (Devara USA)

నార్త్ అమెరికా ప్రీమియర్స్ గ్రాస్ పరంగా తెలుగు సినిమాల్లో 3.9 మిలియన్స్ తో ‘కల్కి 2898 AD’, 3.4 మిలియన్స్ తో ‘ఆర్ఆర్ఆర్’ టాప్-2 లో ఉన్నాయి. మరి ఆ రెండు సినిమాలను ‘దేవర’ బీట్ చేస్తుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here