రంగీలాతో ఇండియన్ చిత్ర పరిశ్రమని ఒక ఊపు ఊపిన నటి ఊర్మిళ మండోద్కర్(urmila matondkar)రంగీలా తర్వాత ఊర్మిళ ఎన్ని భారీ హిట్స్ ని అందుకున్నా కూడా ప్రేక్షకులందరు రంగీలా ఊర్మిళ గానే గుర్తుంచుకున్నారంటే ఆ మూవీతో ఊర్మిళ సృష్టించిన ప్రభంజనాన్ని అర్ధం చేసుకోవచ్చు.తెలుగులో కూడా  గాయం,అంతం,అనగనగా ఒక రోజు,భారతీయుడు వంటి చిత్రాల్లో చేసి అశేష అభిమానులని సంపాదించుకుంది. 

2016 లో కాశ్మీర్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త మోసిన్ అక్తర్ మీర్(  Mohsin Akhtar Mir)ని వివాహం చేసుకున్న ఊర్మిళ ఆ తర్వాత  సినిమాలని స్వస్తిక్ చెప్పింది. అయితే ఇప్పుడు వీరి వైవాహిక బంధంలో విబేధాలు తలెత్తాయనే కధనాలు బాలీవుడ్ సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. నాలుగు నెలల క్రితమే ఊర్మిళ ముంబై కోర్టులో విడాకులకి అప్లై చేసిందని అంటు నేషనల్ మీడియాలో సైతం వార్తలు ప్రసారం అవుతున్నాయి. విడాకులకు కారణాలు మాత్రం రకరకాలుగా వినిపిస్తున్నా కూడా ఊర్మిళ అభిమానులు ఆమాత్రం అందుకు కారణం మోసిన్ నే అని అంటున్నారు.  

చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని ప్రారంభించిన ఊర్మిళ హిందీ,తెలుగు,తమిళ, మలయాళ భాషల్లో కలిపి సుమారు అరవై సినిమాల దాకా చేసింది. వాటిల్లో ఎక్కువ భాగం హిందీ సినిమాలే. చివరగా 2018 లో ఇర్ఫాన్ ఖాన్ హీరోగా వచ్చిన బ్లాక్ మెయిల్ అనే మూవీలోని  ఒక సాంగ్ లో స్పెషల్ అప్పీయరెన్సు లో కనిపించింది. 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here