ఏయే ఉద్యోగాలు..

ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ టైర్ 2 (SSC CHSL Tier II Exam 2024) పరీక్షకు లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) పోస్టులకు 39,835 మంది, డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO)/డీఈవో గ్రేడ్ ‘ఏ’ పోస్టులకు 1630 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వివిధ కారణాలతో 23 మంది అభ్యర్థుల ఫలితాలను నిలిపివేశారు. ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ పరీక్ష ద్వారా భారత ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖలు/ విభాగాలు/ కార్యాలయాలు, వివిధ రాజ్యాంగ సంస్థలు/ చట్టబద్ధ సంస్థలు/ ట్రిబ్యునళ్లలో లోయర్ డివిజనల్ క్లర్క్/ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు సహా సుమారు 3,712 గ్రూప్ సీ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ ఎగ్జామ్ కు ఏప్రిల్ 8న ప్రారంభమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2024 మే 7న ముగిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here