ఒకప్పటి బాలీవుడ్ అందాల భామ, ప్రముఖ హీరోయిన్ రేఖ(rekha)నట ప్రస్థానం గురించి భారతీయ సినీ ప్రేమికులందరికి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి అంతటి వ్యక్తే నేను కాలేజీ చదివే రోజుల్లో నా కళల రాణి రేఖ గారని, బహుశా నా శ్రీమతి సురేఖ లో రేఖ అనే పేరు కూడా ఉందనే పెళ్ళికి ఒప్పుకున్నానేమో అని కూడా చెప్పాడంటే రేఖ ప్రభావాన్ని అర్ధం చేసుకోవచ్చు.బాలీవుడ్ దిగ్గజాలైన రాజేష్ ఖన్నా,అమితాబ్, ధర్మేంద్ర, వినోద్ ఖన్నా,రాజేంధ్ర కుమార్,సంజీవ్ కుమార్,జితేంద్ర,మిథున్ చక్రవర్తి, రిషి కపూర్ వంటి హీరోలతో ఎన్నో సినిమాల్లో నటించి అశేష అభిమానులని సంపాదించుకుంది.

భారతీయ సినిమా రంగంలో ఎంతో  ప్రతిష్టాత్మకంగా భావించే ఐఫా  అవార్డ్స్ వేడుక ఈ  సంవత్సరం అబూదాబి లో  అత్యంత ఘనంగా జరగనుంది. ఈ నెల 27 న  ప్రారంభమయ్యే ఆ వేడుకల్లో ప్రతి సంవత్సరం లాగానే నృత్య ప్రదర్శన ఇవ్వడం కోసం రేఖ అబుదాబి చేరుకున్నారు. కాకపోతే ఈ సారి నూటయాభై మంది డాన్సర్లతో ఇరవై రెండు నిమిషాల పాటు రేఖ నృత్య ప్రదర్శన ఇవ్వనుంది. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ ఐఫా వేడుకకు నా హృదయంలో ఎప్పుడు ప్రత్యేక స్థానం ఉంటుంది.ఇది కేవలం అవార్డుల వేడుక మాత్రమే కాదు. కళ, సంసృతి, ప్రేమని సూచిస్తుంది. అందమైన ప్రదర్శనతో ఈ వేదికపై భారతీయతని ప్రదర్శించడం ఒక వరం. ఐఫా వేదిక నా సొంత ఇంటి లాంటిది కూడా అని చెప్పుకొచ్చింది.దీంతో  డెబ్భై ఏళ్ళ వయసులో కూడా నూటయాభై మంది డాన్సర్లతో కలిసి ప్రదర్శన ఇవ్వడం నిజంగా గ్రేట్ అని అభిమానులు  అంటున్నారు.

రేఖ అచ్చ తెలుగు కుటుంబానికి చెందిన ఆవిడ. ఏఎన్ఆర్ దేవదాస్ తో పాటు ఎన్నో అద్భుతమైన చిత్రాలకి దర్శకత్వం వహించిన  వేదాంత రాఘవయ్య  సోదరుడి కూతురే రేఖ. మహానటి సావిత్రి కూడా  పిన్ని వరుస అవుతుంది. ప్రముఖ తమిళ హీరో స్వర్గీయ జెమిని గణేశన్, ప్రముఖ హీరోయిన్ పుష్పవల్లి లు రేఖ తల్లితండ్రులు. 


 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here