నటసింహం నందమూరి బాలకృష్ణ(balakrishna)అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని వైరల్ చేస్తున్నారు. వైరల్ చెయ్యడమే కాదు మా బాలయ్య రేంజ్ ఇది అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఐఫా అవార్డుల కార్యక్రమం అబుదాబిలో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.ఈ వేడుకకు ఇండియన్ చిత్ర పరిశ్రమకి చెందిన అతిరధ మహారధులు మొత్తం పాల్గొనగా పలు విభాగాలకు సంబంధించి అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన వాళ్లకి అవార్డులు కూడాఅందివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ మూవీకి గాను ఐశ్వర్యారాయ్(Aishwarya rai) కు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు దక్కింది. ఈ అవార్డును బాలకృష్ణ  తన చేతులమీదుగా ఐశ్వర్య కి అందివ్వాల్సి ఉండగా ఆ సమయంలో  అవార్డు అందుకునేందుకు స్టేజీమీదకు వచ్చిన ఐశ్వర్య, బాలకృష్ణ  కాళ్లకు నమస్కరించి అవార్డుని  తీసుకుంది. దీన్ని బట్టి బాలయ్య పట్ల ఇతర నటులకి ఎంత గౌరవం ఉందో అర్ధం అర్ధం చేసుకోవచ్చు. 

ఇక  మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)కి ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇండియన్ సినిమా అవార్డు, బాలకృష్ణ(balakrishna)కు గోల్డెన్ లెగసీ అవార్డులు కూడా అందుకోవడం జరిగింది.విక్టరీ వెంకటేష్(venkatesh)కూడా ఈ కారక్రమంలో పాల్గొన్నాడు.ఈ మేరకు ఆ ముగ్గురు కలిసి దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచాయి. 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here