కరీంనగర్ లో కాంగ్రెస్ గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవైపు జిల్లా మంత్రి బిజీబిజీగా ఉంటున్నారు.. మరోవైపు కీలక నేతలు పెద్దగా లైన్ లో ఉండటం లేదు. కేవలం ప్రకటనల వరకు పరిమితమవుతున్నారన్న భావన చాలా మంది నాయకుల్లో ఉంది. పట్టించుకునేవారు కానరాక పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి.