కెమెరా: కెమెరా పరంగా, వివో వీ40 లో ఓఐఎస్ సపోర్ట్​తో 50 మెగాపిక్సెల్ ఏఎఫ్ ప్రధాన కెమెరా, 50 మెగాపిక్సెల్ ఏఎఫ్ వైడ్ యాంగిల్ సెకండరీ కెమెరాతో కూడిన జియోస్-ఇంటిగ్రేటెడ్ డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. వీ40ఈ స్మార్ట్​ఫోన్ డ్యూయల్ కెమెరా వ్యవస్థతో వస్తుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 882 ప్రధాన కెమెరా ఓఐఎస్ సపోర్ట్, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ముందువైపు రెండు స్మార్ట్​ఫోన్స్​లోనూ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందిస్తున్నాయి.

పనితీరు, బ్యాటరీ: మల్టీటాస్కింగ్, పనితీరు పరంగా చూస్తే, వివో వీ40ఈలో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, 8 జీబీ LPDDR4X ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ ఉన్నాయి. వివో వి40లో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్ 7 జెన్ 3 ఎస్​ఓసీ 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ను కలిగి ఉంది. లాంగ్​ ల్యాస్టింగ్​ పర్ఫార్మెన్స్​ కోసం, వీ40ఈ, వీ40లో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్​కు మద్దతు ఇస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here