తగ్గిన ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ వ్యాల్యూ
హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ విలువ రూ.8,581.64 కోట్లు పెరిగి రూ.13,37,186.93 కోట్లకు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ ఐసీ) విలువ రూ.8,443.87 కోట్లు పెరిగి రూ.6,47,616.51 కోట్లకు చేరాయి. ఇన్ఫోసిస్ ఎంసీఏపీ రూ.459.05 కోట్లు పెరిగి రూ.7,91,897.44 కోట్లకు చేరింది. ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ విలువ రూ.23,706.16 కోట్లు క్షీణించి రూ.9,20,520.72 కోట్లకు పరిమితమైంది. హిందుస్థాన్ యూనిలీవర్ ఎంసీఏపీ రూ.3,195.44 కోట్లు క్షీణించి రూ.6,96,888.77 కోట్లకు పరిమితమైంది.