కోటి టికెట్ ప్రత్యేకతలు

ఒక వ్యక్తి లేదా సంస్థ ఈ సేవా టికెట్ ను కొనుగోలు చేస్తే…సంవత్సరంలో ఏదైనా ఒక రోజును ఎంచుకుని ఉదయాస్తమానం శ్రీవారిని దర్శించుకోవచ్చు. రోజంతా శ్రీవారి సేవల్లో భాగం కావొచ్చు. సుప్రభాతం, తోమాల, అర్చన, అభిషేకం, అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడసేవ, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలలో పాల్గొనవచ్చు. 25 ఏళ్లు పాటు లేదా జీవితాంతం ఏది ముందయితే అందుకు తగిన విధంగా ఈ టికెట్‌ను వినియోగించుకోవచ్చు. టికెట్‌ కొనుగోలు చేసిన వ్యక్తి ఏదైనా కారణం చేత అయినా ఆ ఏడాది తిరుమలకు రాలేకపోతే.. వారి కుటుంబసభ్యులను ఈ సేవకు పంపవచ్చు. కుటుంబ సభ్యుల పేర్ల మార్పునకు ఒకసారి మాత్రమే అవకాశం ఉంటుంది. కంపెనీలకు ఎన్నిసార్లైనా పేర్లు మార్పు చేసుకునే అవకాశం ఇస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here