జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ ‘దేవర’ (Devara) సెప్టెంబర్ 27న విడుదలై సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. మొదటిరోజు వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.172 కోట్ల గ్రాస్ రాబట్టిన దేవర.. రెండో రోజు కూడా రూ.71 కోట్ల గ్రాస్ తో సత్తా చాటింది. దీంతో రెండు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.243 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక మూడో రోజు ఆదివారం కావడంతో రూ.80 కోట్లకు పైగా గ్రాస్ తో.. రూ.300 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరే అవకాశముంది. (Devara Collections)

వరల్డ్ వైడ్ గా సుమారుగా రూ.180 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన దేవర మూవీ.. బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ అనిపించుకోవాలంటే రూ.360 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టాల్సి ఉంది. ప్రస్తుత జోరు చూస్తుంటే మొదటి వారంలోనే ఈ చిత్రం లాభాల్లోకి ఎంటరయ్యే అవకాశం కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here