టీజీ ఎన్పీడీసీఎల్ బదిలీలు
తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ మండలిలో అధికారులు, ఉద్యోగుల బదిలీల ప్రక్రియ మొదలైంది. ఇటీవల పదోన్నతులు కల్పించిన టీజీ ఎన్పీడీసీఎల్ తాజాగా బదిలీలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యోగుల బదిలీల జాబితాలను వెబ్ సైట్(https://tgnpdcl.com/) లో అందుబాటులో ఉంచింది. ఆన్లైన్ విధానంలో బదిలీలు చేపట్టనున్నారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, ప్రొవిన్షియల్ ఉద్యోగులకు గత విధానంలో బదిలీలు నిర్వహించనున్నారు. సిటీ, టౌన్, జిల్లా, మండల కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను గ్రామీణ ప్రాంతాలకు… గ్రామాల్లో పనిచేస్తున్న వారిని నగరం, పట్టణం, జిల్లా, మండల కేంద్రాలకు బదిలీ చేయనున్నారు. అయితే 2025 సెప్టెంబర్ 30వ తేదీ లేదా ఆ లోపు పదవీ విరమణ చేసే వారికి బదిలీల నుంచి ఉపశమనం కల్పించారు.