కేంద్ర క‌మిటీ స‌మావేశాలు

రెండు రోజుల పాటు జ‌రిగే సీపీఎం కేంద్ర క‌మిటీ స‌మావేశాలు ఆదివారం ఢిల్లీలోని హ‌రికిష‌న్ సింగ్ సుర్జీత్ భ‌వ‌న్ (హెచ్‌కేసీ)లో ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాల్లో పార్టీ తాత్కాలిక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప్ర‌కాష్ క‌ర‌త్‌ను కేంద్ర క‌మిటీ ఎంపిక చేసింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ‘‘ఢిల్లీలో జరుగుతున్న భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) సెంట్రల్ కమిటీ 24వ పార్టీ మ‌హాస‌భ జరిగే వరకు (2025 ఏప్రిల్‌లో మధురైలో) సీపీఎం మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పొలిట్ బ్యూరో స‌భ్యులు ప్ర‌కాశ్ క‌ర‌త్‌ను పొలిట్ బ్యూరో, అలాగే సెంట్రల్ కమిటీకి సమన్వయకర్తగా ఉండాలని పార్టీ నిర్ణయించింది. సీపీఎం ప్ర‌స్తుత‌ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ సీతారాం ఏచూరి విచారకరమైన, ఆకస్మిక మరణం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది’’ అని ఆ ప్ర‌క‌ట‌న‌లో సీపీఎం కేంద్ర కమిటీ కార్యాలయం త‌ర‌పున ఆ పార్టీ కేంద్ర క‌మిటీ స‌భ్యులు ముర‌ళీధ‌ర‌న్ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here