బాహుబలితో పాన్ ఇండియా హీరోగా అవతరించిన ప్రభాస్ (Prabhas).. అప్పటినుంచి తన ప్రతి సినిమాకి సౌత్ తో పాటు నార్త్ లోనూ మంచి వసూళ్లు రాబడుతూ అసలుసిసలైన పాన్ ఇండియా హీరో అనిపించుకున్నాడు. అయితే ప్రభాస్ తర్వాత టాలీవుడ్ నుంచి రియల్ పాన్ ఇండియా హీరో అనిపించుకునేది ఎవరనే చర్చ కొంతకాలంగా జరుగుతోంది. ఇప్పుడు దానికి సమాధానంగా జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) పేరు కనిపిస్తోంది.

‘ఆర్ఆర్ఆర్’తో పాన్ ఇండియా హీరో అనిపించుకున్న ఎన్టీఆర్.. ఇటీవల ‘దేవర’ (Devara) తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ముఖ్యంగా హిందీలో ‘దేవర’కి వస్తున్న రెస్పాన్స్.. ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరుస్తోంది. హిందీలో ‘దేవర’ టీం పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు. దీంతో కనీస ఓపెనింగ్స్ కూడా రాబట్టడం కష్టమని భావించారంతా. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. మొదటి రోజు రూ.7.95 కోట్ల నెట్ తో సత్తా చాటింది. ఇక రెండో రోజు మరింత జోరు చూపించి.. రూ.9.50 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. దీంతో రెండు రోజుల్లో రూ.17.45 కోట్ల నెట్ వసూలు చేసింది. ఇక మూడో రోజు ఆదివారం కావడం, అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో ఉండటంతో.. ఏకంగా రూ.15 కోట్ల నెట్ కలెక్ట్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. అంటే మూడు రోజుల్లోనే రూ.30 కోట్ల క్లబ్ లో చేరనుంది. ఇదే జోరు కొనసాగితే ఫస్ట్ వీక్ లో 50 కోట్ల క్లబ్ లో చేరి, ఫుల్ రన్ లో రూ.100 కోట్లు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది.

‘ఆర్ఆర్ఆర్’, ‘దేవర’తో హిందీ ప్రేక్షకులకు దగ్గరైన ఎన్టీఆర్.. రాబోయే సినిమాలతో మరింత దగ్గరవుతాడు అనడంలో సందేహం లేదు. ఎన్టీఆర్ తన నెక్స్ట్ మూవీ హృతిక్ రోషన్ తో ‘వార్-2’ చేస్తున్నాడు. ఇది సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అన్ని చోట్లా సంచలన వసూళ్లు రాబడుతుంది అనడంలో సందేహం లేదు. ఇక ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా లైన్ లో ఉంది. ‘కేజీఎఫ్’ దర్శకుడితో ఎన్టీఆర్ చేస్తున్న మూవీ కావడంతో.. హిందీ ప్రేక్షకులు కూడా దీనిపై ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఇలా వరుస సినిమాలతో హిందీ మార్కెట్ ని పెంచుకునే పనిలో ఉన్నాడు ఎన్టీఆర్. పైగా ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోకి, మాస్ సినిమాలకు నార్త్ లో ఎప్పుడూ మంచి ఆదరణే ఉంటుంది. దానికి ఉదాహరణగా ‘దేవర’ వసూళ్లను చెప్పుకోవచ్చు. చూస్తుంటే ప్రభాస్ తర్వాత రియల్ పాన్ ఇండియా హీరోగా ఎన్టీఆర్ అవతరించే అవకాశముంది.

ఇక ఎన్టీఆర్ తో పాటు ఈ లిస్టులో అల్లు అర్జున్ (Allu Arjun) కూడా చేరతాడు అనడంలో సందేహం లేదు. ఇప్పటికే ‘పుష్ప’తో ఎటువంటి హడావుడి లేకుండా వెళ్లి, నార్త్ లో సంచలనం సృష్టించాడు. దీంతో ‘పుష్ప-2’ కోసం తెలుగు ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో, హిందీ ప్రేక్షకులు కూడా అదే స్థాయిలో ఎదురుచూస్తున్నారు. అన్ని అనుకున్నట్టు కుదిరితే అక్కడ ‘బాహుబలి-2’, ‘కేజీఎఫ్-2’ స్థాయిలో ‘పుష్ప-2’ సంచలనాలు సృష్టించే అవకాశముంది. అదే జరిగితే నార్త్ లో బన్నీ మార్కెట్ కూడా ఒకేసారి ఎన్నో రెట్లు పెరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here