జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘దేవర’ (Devara). పేరుకి పాన్ ఇండియా మూవీ అయినప్పటికీ, దేశవ్యాప్తంగా పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు. దీంతో హిందీలో కనీస ఓపెనింగ్స్ కూడా రావడం కష్టమని భావించారంతా. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ట్రేడ్ వర్గాలే ఆశ్చర్యపోయేలా హిందీలో అదిరిపోయే వసూళ్లతో దూసుకుపోతోంది దేవర. (Devara Hindi Collections)

సెప్టెంబర్ 27న థియేటర్లలో అడుగుపెట్టిన దేవర.. మొదటి రోజు రూ.7.95 కోట్ల నెట్ రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. రెండో రోజు మరింత జోరు చూపించి.. రూ.9.50 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. ఇక మూడో రోజు ఏకంగా రూ.12.07 కోట్లతో వావ్ అనిపించుకుంది. దీంతో మూడు రోజుల్లోనే ఈ సినిమా దాదాపు రూ.30 కోట్ల (రూ.29.52 కోట్లు) నెట్ రాబట్టింది. ఇదే జోరు కొనసాగితే ఫస్ట్ వీక్ లో 50 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం కనిపిస్తోంది. ఫుల్ రన్ లో రూ.100 కోట్లు కలెక్ట్ చేసినా ఆశ్చర్యంలేదు.

తెలుగునాట ‘దేవర’కు కొంత మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. నార్త్ లో మాత్రం పాజిటివ్ టాక్ వస్తోంది. నార్త్ ఆడియన్స్ మాస్ సినిమాలకు బ్రహ్మరథం పడుతుంటారు. ఇప్పుడు దేవర విషయంలో కూడా అదే జరుగుతోంది. దేవర సినిమా అద్భుతంగా ఉందంటూ అక్కడి ఆడియన్స్ చెబుతున్నారు. ముఖ్యంగా మాస్ ఏరియాల్లో ఈ సినిమాకి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here