అయితే, హౌస్‌లోనూ సోనియాపై నెగెటివిటీ బాగా ఎక్కువగా ఉందని ఎలిమినేషన్ ప్రక్రియలో అర్థమైంది. సోనియా, మణిల్లో హౌస్‌లో ఎవరు ఉండాలని కంటెస్టెంట్లను నాగార్జున అడిగారు. నిఖిల్, పృథ్వి, నైనిక మాత్రమే సోనియాకు ఉండాలని అభిప్రాయపడ్డారు. మణికంఠ ఉండాలని కిర్రాక్ సీత, నబీల్ ఆఫ్రిది, ఆదిత్య ఓం, ప్రేరణ, విష్ణుప్రియ, యష్మి చెప్పారు. హౌస్‌లో ఎక్కువ మంది సభ్యులు కూడా సోనియాకు వ్యతిరేకంగా నిలిచారు. దీంతో ప్రేక్షకుల ఓట్లతో పాటు హోస్మేట్స్ అభిప్రాయం తీసుకున్న నాగార్జున.. సోనియా ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు.
Home Entertainment Bigg Boss Remuneration: బిగ్‌బాస్ ద్వారా సోనియా ఎంత సంపాదించారంటే.. నాలుగు వారాల రెమ్యూనరేషన్ ఇదే!