రోడ్ మీద వెళ్తున్నవ్యక్తి హఠాత్తుగా ఆగి ఒక వైపుకి అదే పనిగా చూస్తున్నాడంటే అక్కడ ఉంది ఖచ్చితంగా సినిమా పోస్టరే అయ్యుంటుంది. ఇక ఆ పోస్టర్ లో తన అభిమాన హీరో ఉంటే కనుక ఎంతో తన్మయత్వంతో  పోస్టర్ ని చూస్తూ సినిమాకి ఎప్పుడు వెళ్లాలనే ప్లాన్ చేసుకుంటాడు. అంతలా సగటు మనిషికి సినిమా పోస్టర్ కి మధ్య అనుబంధం  ఉంది.

కానీ ఇప్పుడు అనుబంధం తెగిపోనుంది. గ్రేటర్ హైదరాబాద్  పరిధిలో ఎక్కడ కూడా  సినిమా వాల్ పోస్టర్స్(cinema poster)అంటించకూడదని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(ghmc)కమిషనర్ నుంచి  ఉత్తర్వులు జారీ అయ్యాయి.ఒక వేళ నిబంధనలని అతిక్రమించి ఎవరైనా పోస్టర్ అంటిస్తే సంబంధిత ప్రింట్ ఎవరైతే తీశారో వాళ్ళకి పెనాల్టీ వేస్తారు.అంటే ఆ చిత్ర నిర్మాతకి పెనాల్టీ విధించడం జరుగుతుంది.

ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సినీ ప్రేమికుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ విషయం మీద సినీ పరిశ్రమ పెద్దలు ఏమంటారో చూడాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here