ప్రేమ ఎంతో విలువైనది

గాంధీ దక్షిణాఫ్రికా నుండి బొంబాయి వచ్చాక కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ గాంధీజీ కుర్చీల కింద, బల్లల కిందా ఏదో ఆత్రుతగా వెతకడం మిగతావారు గమనించారు. ఏమైందని అతడిని అడిగారు. దానికి గాంధీజీ నా పెన్సిల్ పోగొట్టుకున్నాను అని చెప్పారు గాంధీ. దానికి వారు ఒక పెన్సిల్ కోసం ఎందుకు వెతకడం, చాలా పెన్సిల్స్ ఉన్నాయి అని చెప్పారు. దానికి గాంధీజీ ‘లేదు, నాకు నా పెన్సిల్ కావాల్సిందే’ అని పట్టు పట్టారు. వేరే పెన్సిల్ వాడమని ఇచ్చినా కూడా వారు ఒప్పుకోలేదు. ఇక గాంధీజీ వినరని అర్థం అయ్యి అందరూ పెన్సిల్‌ను వెతకడం ప్రారంభించారు. చివరికి చిన్న మూడు సెంటీమీటర్ల పెన్సిల్ దొరికింది. ఇంత చిన్న పెన్సిల్ కోసం ఇంతగా వెతకాలి అంటూ అందరూ విమర్శించారు. దానికి గాంధీజీ ఇది పెన్సిల్ కాదు, ఒక జ్ఞాపకం, ఒకరి ప్రేమ. గాంధీజీకి ఆ పెన్సిల్ మొక్కను ఇచ్చింది మద్రాసులో ఉన్న నటేశన్ అనే వ్యక్తి కొడుకు. గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి ఇండియాకు వచ్చాక నటేశన్ ఇంట్లో కొన్ని రోజులు ఉన్నారు. అతని కొడుకు తన జ్ఞాపకంగా ఆ పెన్సిల్ ముక్కను గాంధీజీకి ఇచ్చారు. దాన్ని ఎంతో జాగ్రత్తగా ఒక గుర్తుగా దాచుకున్నారు. గాంధీ తనను ప్రేమించే వారికి అంత విలువ ఇస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here