ఏకాగ్రత – లక్ష్యం

అర్జునుడు గొప్ప విలుకాడు. మహాభారతంలోని ప్రధాన పాత్రల్లో ఆయన ఒకరు. అతని నుండి నేర్చుకోవాల్సింది లక్ష్యానికి సరిగ్గా గురిపెట్టడం. ఒకసారి ద్రోణాచార్యుడు తన శిష్యులైన పాండవులు, కౌరవుల్ని పరీక్షించాలనుకుంటాడు. చెట్టుపై ఉన్న పక్షి కన్నుని కొట్టాలని పరీక్ష పెడతాడు. తన శిష్యులందరినీ మీకు ఏం కనిపిస్తోంది అని అడుగుతాడు. వారంతా… కొందరు పక్షి అని, కొందరు చెట్టు అని, కొందరు ఆకులు అని రకరకాల సమాధానాలు ఇస్తారు. కానీ అర్జునుడు మాత్రం తనకు పక్షి కన్ను మాత్రమే కనిపిస్తోంది చెబుతాడు. అలాగే పక్షి కన్నుని గురి చూసి కొడతాడు. పని పట్ల ఏకాగ్రత, లక్ష్యం నిర్దేశించుకోవడం అనేది అర్జున్ ని చూసి నేర్చుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here